వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హత ప్రమాణం

Schemes
వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds అనగా
  • 2019 ఆగష్టు 15 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ను నియమించినది . .

  • ఈ 50 ఇండ్లను కలిపి ఒక వాలంటీర్ క్లస్టర్ గా పరిగనిస్తారు .

  • ప్రతి కుటుంబం యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొనుటకు ప్రతి వాలంటీర్ ప్రతి కుటుంబానికి ఒక హౌస్ హోల్డ్ id ని మాప్ చెయ్యడం జరిగినది .

  • హౌస్ హోల్డ్ అనగా కుటుంబ పెద్ద ,మిగిలిన కుటుంబ సభ్యులు మరియు కుటుంబ పెద్దతో సంబంధం వివరాలు వుంటాయి. .

  • హౌస్ హోల్డ్ మాపింగ్ సంక్షేమ పధకాల యొక్క అర్హులను మరియు అనర్హులను గుర్తించుటలో ఎంతో కీలకంగా మారింది . .

  • ఎవ్వరైనా వివాహం చేసుకొని ఇంకా వారి తల్లి తండ్రుల హౌస్ హోల్డ్ మాపింగ్ లో వున్న యెడల వారు( భార్య భర్తలు ) వేరుగా హౌస్ హోల్డ్ మాపింగ్ చేసుకొనుటకు వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds ఉపయోగపడుతుంది .

  • దీని వలన లాభం ఏంటంటే , తల్లి తండ్రులు గాని భార్య భర్తలుగాని ఎ ఒక్కరు అనర్హులైన ఆ కుటుంబం మొత్తం వారికి అందే సంక్షేమ ఫలాలను కోల్పోవలసి వస్తుంది

  • వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds మీద హౌస్ మాపింగ్ వేరు చేసుకుంటే తల్లి తండ్రులు గాని భార్య భర్తలుగాని ఎ ఒక్కరు అర్హులు వున్న వారి హౌస్ హోల్డ్ మాపింగ్ వేరుగా వుంది కాబట్టి సంక్షేమ ఫలాలు అందే అవకాశం వుంది .

  • ఉదహరణకు వివాహం ఐన కూతురు / కొడుకు ఆదాయ పన్ను చె ల్లిస్తన్నట్లైతే వివాహం ఐన కూతురు / కొడుకు వలన వారి తల్లితండ్రులు సంక్షేమ ఫలాలు , రైతు భరోసా ,వై ఎస్ ఆర్ పెన్షన్ మొదలైనవి కోల్పోతారు . వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds హౌస్ హోల్డ్ మాపింగ్ వేరు చేసుకున్న యెడల వారి తల్లితండ్రులకి సంక్షేమ ఫలాలు అందే అవకాశం వున్నది.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • భార్య భర్తలు(ఇంతకు ముందు తల్లి తండ్రులలో వుంటూ కొత్తగా వివాహం ఐన వారు ) మాత్రమే వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds మీద హౌస్ మాపింగ్ వేరు చేసుకొనుటకు అర్హులు .

  • వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds మీద హౌస్ మాపింగ్ వేరు చేసుకొనునప్పడు తప్పనిసరిగా పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు సచివాలయం వద్దకు రావలెను (వారి యొక్క ఫింగర్ ప్రింట్ నిర్ధారణ కొరకు) .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  • వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds మీద హౌస్ మాపింగ్ వేరు చెయ్యవలెను అని పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురు తరపున mpdo/MC గారికి ఒక వ్రాత పూర్వక అర్జీ *

  • పెళ్లి కూతురు ఆధార్ కార్డు జెరాక్స్ .*

  • పెళ్లి కొడుకు ఆధార్ కార్డు జెరాక్స్ .*

  • వివాహ దృవపత్రం జెరాక్స్ *

  • గమనిక : పైన చెప్పిన పత్రాలు తీసుకొని మీ సచివాలయంలో ని పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు /WEDPS ను కలవవలెను.


మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top