వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు సభ్యున్ని జోడించుట - Member Addition in Aarogya Sri Card
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు సభ్యున్ని జోడించుట - Member Addition in Aarogya Sri Card అనగా
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు సభ్యున్ని జోడించవలెనన్న హౌస్ హోల్డ్ మాపింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు 5 సంవత్సరాల కన్నా తక్కువ వున్న పిల్లలను జోడించవలెనన్న హౌస్ హోల్డ్ మాపింగ్ అవసరం లేదు.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అనునది ప్రజా ఆరోగ్య కార్యక్రమం.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు.
*వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పధకం కింద అర్హులైన పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు..
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలతోపాటుగా రవాణా, భోజన, వసతి సదుపాయాలను కూడా కల్పిస్తారు.
* ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.
* ఆరోగ్య శ్రీ పథకం కింద 1059 రోగాలకు సేవలు అందిస్తుండగా.. ఆ సంఖ్యను 2434కు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
అర్హత ప్రమాణం - Eligibility Criteria
వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండవలెను .
12 ఎకరాల కన్నా తక్కువ మాగాణి భూమి.,35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూమి లేదా మాగాణి భూమి మరియు మెట్ట భూమి రెండూ కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉండవలెను.
మున్సిపల్ ప్రాంతం లో 3000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఆస్తి ఉండవలెను .
ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా అర్హులు .
కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.
టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు , మరియు మినహాయించి కుటుంబానికి ఒక్క నాలుగు చక్రాల వాహనం ( కారు ) కంటే ఎక్కువ ఉండరాదు.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని జోడించుట కొరకు హౌస్ హోల్డ్ మాపింగ్ ఎలా వుండాలి ?
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని జోడించుటకు దరకాస్తు చేసుకోనునప్పుడు ముందుగా వాలంటీర్ దగ్గర హౌస్ హోల్డ్ మాపింగ్ చెక్ చేసుకోవాలి .
ఎ కుటుంబంలో అయితే సభ్యుణ్ణి జోడించుటకు దరకాస్తు చేసుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఒకే హౌసేహోల్ద్ మాపింగ్(వాలంటీర్ వద్ద) లో వుండాలి .
ఎ కుటుంబంలో అయితే సభ్యుణ్ణి జోడించుటకు దరకాస్తు చేసుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యునికి ఇది వరకే ఆరోగ్య శ్రీ కార్డు ఉండరాదు .
ఒకవేళ ఒక కుటుంబంలో ని సభ్యుడు వేరే కుటుంబంలో వున్న యెడల ముందు ఆ కుటుంబం నుండి ఆ మెంబెర్ ని తొలగించుకొని , ఆ తర్వాత తన కుటుంబంలో సభ్యుణ్ణి జోడించుటకు కొరకు దరకాస్తు చేసుకోవాలి.
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని జోడించుట - Member Addition in Aarogya Sri Card దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
అప్లికేషను ఫారం *
ఫ్యామిలీ ఫోటో (*
మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్ లు (Aadhar card Xerox)*
రైస్ కార్డు జెరాక్స్ / జగనన్న విద్యా దీవెన / జగనన్న వసతి దీవెన జెరాక్స్ *
జనన ధృవీకరణ పత్రం / వివాహ ధృవీకరణ పత్రం *
దరకాస్తు దారిని సంతకం మరియు మొబైల్ నెంబర్ *
గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి , *పైన తెలిపిన అన్ని పత్రాలు , అర్హతా ప్రమాణం , హౌస్ హోల్డ్ మాపింగ్ అన్ని పైన తెలిపిన విధంగా వున్న యెడల మాత్రమే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని జోడించుటకు అర్హులు.
అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి
వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని జోడించుట - Member Addition in Aarogya Sri Card అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓
మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు అఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.
Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail
No comments:
Post a Comment