వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నుండి సభ్యుణ్ణి తొలగించుట - Member Deletion from Aarogya sri card కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హతా ప్రమాణం , హౌస్ హోల్డ్ మాపింగ్ ,అప్లికేషను ఫారం

Schemes
ఆరోగ్య శ్రీ కార్డు నుండి సభ్యుణ్ణి తొలగించుట - Member Deletion from Aarogya sri card అనగా
  • వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నుండి సభ్యున్ని తొలగించవలెనన్న హౌస్ హోల్డ్ మాపింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.

  • వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు 5 సంవత్సరాల కన్నా తక్కువ వున్న పిల్లలను తొలగించవలెనన్న హౌస్ హోల్డ్ మాపింగ్ అవసరం లేదు.

  • వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అనునది ప్రజా ఆరోగ్య కార్యక్రమం.

  • దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని 2007 ఏప్రిల్ 1 న రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పేరుతో ఆవిష్కరించారు.

  • *వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పధకం కింద అర్హులైన పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు..

  • * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలతోపాటుగా రవాణా, భోజన, వసతి సదుపాయాలను కూడా కల్పిస్తారు.

  • * ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదై ఉచిత వైద్య సేవలను పొందవచ్చు.

  • * ఆరోగ్య శ్రీ పథకం కింద 1059 రోగాలకు సేవలు అందిస్తుండగా.. ఆ సంఖ్యను 2434కు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.


అర్హత ప్రమాణం - Eligibility Criteria
  • వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండవలెను .

  • 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణి భూమి.,35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూమి లేదా మాగాణి భూమి మరియు మెట్ట భూమి రెండూ కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువ ఉండవలెను.

  • మున్సిపల్ ప్రాంతం లో 3000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఆస్తి ఉండవలెను .

  • ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా అర్హులు .

  • కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  • టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు , మరియు మినహాయించి కుటుంబానికి ఒక్క నాలుగు చక్రాల వాహనం ( కారు ) కంటే ఎక్కువ ఉండరాదు.


వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని జోడించుట కొరకు హౌస్ హోల్డ్ మాపింగ్ ఎలా వుండాలి ?
  • వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని తొలగించుటకు దరకాస్తు చేసుకోనునప్పుడు ముందుగా వాలంటీర్ దగ్గర హౌస్ హోల్డ్ మాపింగ్ చెక్ చేసుకోవాలి .

  • ఎ కుటుంబంలో నుండి అయితే సభ్యుణ్ణి తొలగించుటకు దరకాస్తు చేసుకుంటున్నారో ఆ సభ్యుడు ఆ తొలగించదలచిన కుటుంబంలో హౌసేహోల్ద్ మాపింగ్(వాలంటీర్ వద్ద) లో వుండరాదు .

  • ఎ కుటుంబంలో అయితే సభ్యుణ్ణి తొలగించుటకు దరకాస్తు చేసుకుంటున్నారో ఆ కుటుంబ సభ్యుడు ఇది వరకే ఆ తొలగించదలచిన కుటుంబం యొక్క ఆరోగ్య శ్రీ కార్డు లో ఉండి, తొలగించదలచిన కుటుంబం యొక్క హౌసేహోల్ద్ మాపింగ్(వాలంటీర్ వద్ద) లో వుండరాదు .


వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నుండి సభ్యుణ్ణి తొలగించుట - Member Deletion from Aarogya sri card దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం *

  • ఫ్యామిలీ ఫోటో *

  • మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్ లు (Aadhar card Xerox)*

  • రైస్ కార్డు జెరాక్స్ / జగనన్న విద్యా దీవెన / జగనన్న వసతి దీవెన జెరాక్స్ *

  • జనన ధృవీకరణ పత్రం / వివాహ ధృవీకరణ పత్రం *

  • దరకాస్తు దారిని సంతకం మరియు మొబైల్ నెంబర్ *


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి ,
    *పైన తెలిపిన అన్ని పత్రాలు , అర్హతా ప్రమాణం , హౌస్ హోల్డ్ మాపింగ్ అన్ని పైన తెలిపిన విధంగా వున్న యెడల మాత్రమే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నందు సభ్యున్ని జోడించుటకు అర్హులు.



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డు నుండి సభ్యుణ్ణి తొలగించుట - Member Deletion from Aarogya sri card అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు అఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top