కొత్త రైస్ / రేషన్ కార్డు - New Rice / Ration Card కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హతా ప్రమాణం , అప్లికేషను ఫారం

Schemes
కొత్త రైస్ / రేషన్ కార్డు - New Rice / Ration Card అనగా
  • జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి సబ్సిడీ ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అర్హత ఉన్న కుటుంబాలకు భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అధికారిక పత్రం రైస్ / రేషన్ కార్డులు.

  • రైస్ / రేషన్ కార్డులు ప్రజలకు సాధారణ గుర్తింపుగా కూడా పనిచేస్తాయి.

  • రైస్ / రేషన్ కార్డులు ఒక కుటుంబాన్ని అధికారికంగా గుర్తించడానికి ఉపయోగపడతాయి.

  • * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పధకాలలో మరియు వివిధ దృవీకరణ పత్రాలు జారీ చేయు విషయంలో రైస్ / రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డు గా పరిగనించబడుతుంది .

  • నూతనంగా రైస్ / రేషన్ కార్డు కొరకు దరకాస్తు చేసుకోనునప్పుడు కుటుంబంలో (భార్యా భర్తలు మరియు వివాహం కాని పిల్లలు ) ఎ ఒక్కరికి కూడా ఇది వరకే రైస్ / రేషన్ కార్డు ఉండరాదు .

  • * ఒక వేల కుటుంబంలో (భార్యా భర్తలు మరియు వివాహం కాని పిల్లలు ) ఎ ఒక్కరికైనా ఇది వరకే రైస్ / రేషన్ కార్డు ఉండిన యడల రైస్ కార్డు స్ప్లిట్టింగ్ ద్వారా నూతన వధూవరులు కొత్త రైస్ / రేషన్ కార్డు పొందే అవకాశం వున్నది .


అర్హత ప్రమాణం - Eligibility Criteria
  • గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి. .

  • నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి. .

  • టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.

  • ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.

  • కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  • కుటుంబంలో ఎ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండరాదు .

  • ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా అర్హులు .

  • కుటుంబం అనగా భార్యాబర్తలు మరియు వారికి కలిగిన సంతానాన్న సాధారణంగా ఒక కుటుంబంగా పరిగనిస్తారు .


నూతన రైస్ / రేషన్ కార్డు - New Rice / Ration Card దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం *

  • మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్ లు (Aadhar card Xerox)*

  • ఆదాయ ధృవీకరణ పత్రం - Income Certificate


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి ,
    *పైన తెలిపిన అన్ని పత్రాలు , అర్హతా ప్రమాణం అన్ని పైన తెలిపిన విధంగా వున్న యెడల మాత్రమే ఆ కుటుంబ సభ్యులు నూతన రైస్ / రేషన్ కార్డు పొందగలరు.



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

నూతన రైస్ / రేషన్ కార్డు - New Rice / Ration Card అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు అఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top