పీ ఏం కిసాన్ ఈ కే వై సి - మొబైల్ మరియు ఆధార్ లింక్ లేకుండా ఎలా చేసుకోవాలి ?

Schemes
ముఖ్యాంశాలు
  • ప్రవేశ పెట్టిన వారు :

    కేంద్ర ప్రభుత్వం

  • లబ్దిదారులు :

    రైతులు

  • అర్హతలు :

    * భారతీయ పౌరులు అయ్యి ఉండాలి.

    *చిన్న, సన్న కారు రైతులు ఎవరైనాసరే ఈ పథకంలో చేరొచ్చు.

    *వ్యవసాయ పొలం కలిగిన వారికి కూడా పథకం వర్తిస్తుంది.

    *గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతులు అందరూ పథకంలో చేరేందుకు అర్హులు.

  • లాభాలు :

    *అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని తీసుకువచ్చింది.

    * ప్రతి ఏటా రూ.6 వేలు అందిస్తారు.

  • రూ.6 వేలు ఎలా వస్తాయి :

    * ప్రతి ఆర్థిక సంవత్సరంలో తొలి విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి జూలై 31లోపు రైతులకు చేరతాయి.

    *రెండో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30లోపు రైతుల బ్యాంక్ ఖాతాలలోకి చేరతాయి.

    *మూడో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు డిసెంబర్ 1 నుంచి మార్చి 31లోపు ఎప్పుడైనా రావొచ్చు.


పీ ఏం కిసాన్ ఈ కే వై సి ఎందుకు ?
  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 11 వాయిదాను పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీని పూర్తి చేయాలి.

    * పీఎం కిసాన్ నమోదిత రైతులకు ఈ-కేవైసీ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

    *పీఎం కిసాన్ లబ్దిదారులందరూ పొడిగించిన తుది గడువు మే 31, 2022 లోపల ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.


పీ ఏం కిసాన్ ఈ కే వై సి - మొబైల్ మరియు ఆధార్ లింక్ లేకుండా ఎలా చేసుకోవాలి ?
  • పీ ఏం కిసాన్ లబ్దిదారుడు ముందు సి ఎస్ సి సెంటర్కి గాని లేదా దగ్గరలోని సచివాలయానికి గాని వెళ్లి పీ ఏం కిసాన్ బయోమెట్రిక్ ఈ కే వై సి చేయించుకోవచ్చు .

  • లబ్దిదారుడు తన ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్ తెచ్చుకోవాలి (ఆధార్ లింక్ అవ్వాల్సిన అవసరం లేదు ).

    * అప్పుడు మీ సచివాలయంలో వున్న పంచాయితి కార్యదర్శి గ్రేడ్ 6 డిజిటల్ సహాయకులు మీకు ఈ పని పూర్తి చేసి పెట్టగలరు .


పీ ఏం కిసాన్ కి కొత్తగా నమోదు చేసుకోవడానికి కావలసినవి ?
  • ఆధార్ కార్డు జెరాక్స్ .

  • రైస్ కార్డు జెరాక్స్.

  • బ్యాంకు పాస్ బుక్ జెరాక్స్.

  • పొలం పాస్ బుక్ జెరాక్స్.

  • మొబైల్ ఫోన్ అండ్ మొబైల్ నెంబర్ .

మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top