మ్యారేజీ సర్టిఫికెట్ - Marriage Certificate దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హతా ప్రమాణం , హౌస్ హోల్డ్ మాపింగ్ ,అప్లికేషను ఫారం

మ్యారేజీ సర్టిఫికెట్ - Marriage Certificate
మ్యారేజీ సర్టిఫికెట్ - Marriage Certificate అనగా
  • భారతదేశంలో 1955 హిందూ వివాహ చట్టం కింద లేదా 1954 వివాహ ప్రత్యేక చట్టం కింద మ్యారేజీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

  • ఒక పురుషుడు మరియు స్త్రీ వివాహం చేసుకున్నారని ధ్రువీకరించే అధికారికమైన సర్టిఫికెట్ మ్యారేజీ సర్టిఫికెట్ .

  • 18 సంవత్సరాలు నిండిన స్త్రీ మరియు 21 సంవత్సరాలు నిండిన పురుషుడు వివాహo చేసుకొనిన యెడల గడువు సమయంలో (సుమారుగా 61 రోజులలోపు ) ,వివాహం చేసుకొనిన పంచాయతి యొక్క పంచాయతి కార్యదర్శి ని తగు ప్రూఫ్స్ తో కలిసిన యెడల మీకు ఈ మ్యారేజీ సర్టిఫికెట్ ని మంజూరు చేస్తారు .

  • ఒక వేల గడువు దాటినా యెడల మీరు వివాహం జరిగిన ప్రదేశం యొక్క పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ గారిని తగు ప్రూఫ్స్ తో కలిసిన యెడల మీకు సబ్ రిజిస్ట్రార్ గారు మ్యారేజీ సర్టిఫికెట్ ని మంజూరు చేస్తారు .

  • ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఈ కాలంలో చాలా సందర్భాలలో ఒక జంటను నిర్ధారించేందుకు ఓక ప్రూఫ్ గా తీసుకుంటున్నారు .

  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో వివాహం జరిగి వేరే హౌసేహోల్ద్ ఏర్పాటు చేసుకోవడం లో ( వివాహ ప్రాతిపదికన గృహ వలసలు - Household Migration on Marriage Grounds ) ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కీలకంగా మారింది.


అర్హత ప్రమాణం (Eligibility Criteria)
  • 18 సంవత్సరాలు నిండిన స్త్రీ మరియు 21 సంవత్సరాలు నిండిన పురుషుడు వివాహo చేసుకొన్న యెడల ఈ సర్టిఫికేట్ పొందడానికి అర్హులు .


కావాల్సిన పత్రాలు (Required Documents )
  1. అప్లికేషను ఫారం (Application Form) .

  2. పెళ్లి కూతురు ఆధార్ కార్డు జెరాక్స్ మరియు పాస్పోర్ట్ సైజు ఫోటో *

  3. పెళ్లి కొడుకు యొక్క ఆధార్ కార్డు జెరాక్స్ మరియు పాస్పోర్ట్ సైజు ఫోటో *

  4. వెడ్డింగ్ కార్డు *

  5. పెళ్లి జరుగునప్పుడు (పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు ఉండాలి) పోస్ట్ కార్డు సైజు ఫోటోలు ( 3 ) *.

  6. పెళ్లి కూతురు తల్లి తండ్రుల ఆధార్ కార్డు జెరాక్స్ లు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు *

  7. పెళ్లి కొడుకు తల్లి తండ్రుల ఆధార్ కార్డు జెరాక్స్ లు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు *

  8. పెళ్లి కూతురు తరపున ఇద్దరు సాక్ష్యుల ఆధార్ కార్డు జెరాక్స్ లు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు *

  9. పెళ్లి కొడుకు తరపున ఇద్దరు సాక్ష్యుల ఆధార్ కార్డు జెరాక్స్ లు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు *

  10. పెళ్లి కొడుకు మరియు పెళ్లి కూతురి యొక్క స్వీయ దృవీకరణ లెటర్ *


అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

మ్యారేజీ సర్టిఫికెట్ - Marriage Certificate అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓

మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు ఆఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top