Our Content Quantitative Aptitude Reasoning General Awareness English Computer Awareness Banking Quizzes Innovative Tools Spotting Error Quizzes Static GK Quizzes Current Affairs
1. Quantitative Aptitude

రైస్ కార్డు లో సభ్యుణ్ణి జోడించుట మరియు తొలగించుట - Member Addition/Deletion in Rice card కి దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు , అర్హతా ప్రమాణం , అప్లికేషను ఫారం

Rice Card
రైస్ కార్డు లో సభ్యుణ్ణి జోడించుట మరియు తొలగించుట - Member Addition/Deletion in Rice card అనగా
  • రైస్ కార్డు లో సభ్యుణ్ణి జోడించుట :

    ప్రస్తుతం వున్న రైస్ కార్డు లోకి మనం రెండు విధాలుగా కుటుంబ సభ్యులని జోడిoచవచ్చు .

  • 1. జననం ద్వారా :

    ఒక కుటుంబoలో భార్య భర్త లుగా రైస్ కార్డు కలిగి వుంది వారికి కలిగిన 15 సంత్సరాల లోపు వయస్సు వున్న పిల్లలను (ఈ పిల్లలు వేరే రైస్ కార్డులో ఉండరాదు )రైస్ కార్డులో కి జోడించ వచ్చును .

  • 1. వివాహం ద్వారా :

    నూతనంగా విహాహం చేసుకున్న వధూవరులను వారి వద్ద వివాహ ధ్రువ పత్రం Marriage Certificate వున్న యెడల వారిని ప్రస్తుతం వున్న రైస్ కార్డులో కి జోడించ వచ్చును .

  • రైస్ కార్డు లో సభ్యుణ్ణి తొలగించుట :

    ప్రస్తుతానికి ఒక రైస్ కార్డు లో నుండి చనిపోయిన కుటుంబ సభ్యుణ్ణి మాత్రమే తొలగించుటకు అవకాశం వున్నది .

  • * ఒక వేల కుటుంబంలో (భార్యా ర్యా బర్తలు మరియు వివాహం కాని పిల్లలు ) ఎ ఒక్కరికైనా ఇది వరకే రైస్ / రేషన్ కార్డు ఉండిన యడల రైస్ కార్డు స్ప్లిట్టింగ్ ద్వారా నూతన వధూవరులు కొత్త రైస్ / రేషన్ కార్డు పొందే అవకాశం వున్నది .

  • జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద ప్రజా పంపిణీ వ్యవస్థ నుండి సబ్సిడీ ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అర్హత ఉన్న కుటుంబాలకు భారతదేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే అధికారిక పత్రం రైస్ / రేషన్ కార్డులు.

  • రైస్ / రేషన్ కార్డులు ప్రజలకు సాధారణ గుర్తింపుగా కూడా పనిచేస్తాయి.

  • * రైస్ / రేషన్ కార్డులు ఒక కుటుంబాన్ని అధికారికంగా గుర్తించడానికి ఉపయోగపడతాయి.

  • * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పధకాలలో మరియు వివిధ దృవీకరణ పత్రాలు జారీ చేయు విషయంలో రైస్ / రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డు గా పరిగనించబడుతుంది .


అర్హత ప్రమాణం - Eligibility Criteria
  • గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతి నెలా రూ 10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ12 వేల లోపు నెలసరి ఆదాయం కలిగి ఉండాలి. .

  • నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి, లేదా పది ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి పది ఎకరాలలోగా కలిగి ఉండాలి. .

  • టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు మినహాయించి నాలుగు చక్రాల వాహనాలు ఉండరాదు.

  • ప్రతి నెలా కరెంటు వినియోగం 300 యూనిట్లకు మించరాదు.

  • కుటుంబంలో ఆదాయం పన్ను చెల్లించే సభ్యులు ఉండరాదు.

  • కుటుంబంలో ఎ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వ ఉద్యోగి అయ్యి ఉండరాదు .

  • ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న గౌరవ వేతనం ఆధారిత ఉద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా అర్హులు .

  • కుటుంబం అనగా భార్యాబర్తలు మరియు వారికి కలిగిన సంతానాన్న సాధారణంగా ఒక కుటుంబంగా పరిగనిస్తారు .


రైస్ కార్డు లో సభ్యుణ్ణి జోడించుట మరియు తొలగించుట - Member Addition/Deletion in Rice card దరకాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు (Required Documents )
  • అప్లికేషను ఫారం *

  • మొత్తం కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్ లు (Aadhar card Xerox)*

  • రైస్ కార్డు జెరాక్స్ *

  • వివాహ ధ్రువ పత్రం Marriage Certificate (వివాహం ద్వారా అయితే ) / జనన ధ్రువ పత్రం (జననం ద్వారా అయితే) ( జోడిన్చుటకు )*

  • వివాహం ద్వారా చేర్పు కొరకు తల్లితండ్రుల రైస్ కార్డు నెంబర్ (లేనిచో) తల్లితండ్రుల ఆధార్ నెంబర్లు (జోడిన్చుటకు )*

  • మరణ ధ్రువ పత్రం జెరాక్స్(తొలగించుటకు ) *


  • గమనిక : * అని మార్క్ చేసినవి తప్పని సరిగా వుండాలి ,
    *పైన తెలిపిన అన్ని పత్రాలు , అర్హతా ప్రమాణం అన్ని పైన తెలిపిన విధంగా వున్న యెడల మాత్రమే ఆ కుటుంబ సభ్యులు నూతన రైస్ / రేషన్ కార్డు పొందగలరు.



అప్లికేషను ఫారం ఈ క్రింది నుండి డౌన్లోడ్ చేసుకోండి

రైస్ కార్డు లో సభ్యుణ్ణి జోడించుట - Member Addition n in Rice card అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓



రైస్ కార్డు లో సభ్యుణ్ణి తొలగించుట - Member Deletion in Rice card అప్లికేషను ఫారం డౌన్లోడ్ ↓


మరిన్ని సేవల గురించి తెలుసుకొనుటకు కమ్మ మధుసూధన రావు ,పంచాయితి కార్యదర్శి గ్రేడ్ VI డిజిటల్ సహాయకులు అఫీషియల్ వెబ్ పేజి కి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి.

Subscribe(must and should verify) & Follow to get more Updates via E-mail

No comments:

Post a Comment

Back to Top